బరువు తగ్గడంలో ఇవి కీలకం!

డైలీ రొటీన్‌లో చిన్నచిన్న మార్పులతో బరువు తగ్గొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘ఒకే టైమ్‌కు తినడంతో పాటు డైట్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్‌ను వేగంగా తినొద్దు. నెమ్మదిగా నములుతూ తినాలి. తినే అరగంట ముందు నీరు/మజ్జిగ తీసుకుంటే ఫుడ్ క్వాంటిటీ తగ్గుతుంది. రాత్రి 7లోపు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది’ అని చెబుతున్నారు.