ఆటే నా పొగరు.. రామ్‌చరణ్ ‘పెద్ది’ ట్రైలర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ట్రైలర్ రిలీజైంది. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా చెర్రీ కనిపించారు. ‘ఆటే నా పొగరు’, ‘నేను ఆడాననుకున్నారా సారూ.. పోరాడాను’ అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా మాస్ డైలాగులతో అదరగొట్టారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవనుంది. ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.