
వేసవి తాపం తగ్గించుకునేందుకు చాలామంది తొలి ఎంపిక మజ్జిగ. 2 వారాల పాటు దీన్ని తాగితే శరీరానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ‘మజ్జిగలోని మంచి బాక్టీరియా ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది. అలాగే గ్యాస్/బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి. దాని సహజమైన చల్లదన లక్షణం శరీర అంతర్గత వేడిని తగ్గిస్తుంది. భోజనానికి ముందు తాగితే తినే క్వాంటిటీ తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది’ అని సూచిస్తున్నారు.