‘చిట్టి చిలకమ్మా’ రాసింది ఈవిడే..

ప్రతి తెలుగు బిడ్డ తొలి పలుకు, మన అమ్మలు నేర్పిన మొదటి పాట 'చిట్టి చిలకమ్మా'. దశాబ్దాలుగా వింటున్న ఈ పాట వెనుక ఉన్న స్వరం జనగామ జిల్లా కట్కూరు గ్రామానికి చెందిన బల్ల సరస్వతి అని చాలా మందికి తెలిసి ఉండదు. ఇటీవల ఆమె ఈ బాలగేయాన్ని పాడిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు భాష ఉన్నంతకాలం ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.