వామ్మో.. ఎలా ఎగిరిపడ్డాడో చూడండి!

UPలోని బరేలీలో భయంకరమైన <<19870165>>ఈదురుగాలులు<<>> బీభత్సం సృష్టించాయి. పెళ్లి వేడుకలో గాలులు వీస్తుండటంతో ఓ యువకుడు హోర్డింగ్ రాడ్డును పట్టుకొని నిలబడ్డాడు. కానీ విండ్స్ ధాటికి హోర్డింగ్ విరిగిపోయింది. దీంతో ఆ అబ్బాయి అమాంతం 10 మీటర్లకు పైగా ఎత్తుకు ఎగిరిపడ్డాడు. అతడి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.