మీరు ఎక్కడ ఉన్నా స్వామి చూపు మీపైనే!
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ BHELలోని ఓల్డ్ MIG కాలనీ రామాలయంలో ఉన్న భారీ ఆంజనేయుడి విగ్రహం వీడియో ఆకట్టుకుంటోంది. 27 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే భక్తులు ఏ కోణం నుంచి చూసినా స్వామి వారు తమనే చూస్తున్నట్లు కనిపిస్తారు. అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో రూపొందించిన ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.