భద్రాద్రి: 81 ఏళ్లలోనూ 52 ఏళ్ల బిడ్డకు అండగా..!
ఆమెకు 80 ఏళ్లు దాటాయి.. ఒంట్లో ఓపిక తగ్గింది.. కానీ బిడ్డపై ప్రేమ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. భర్త ఆదరించకపోయినా, పుట్టిన బిడ్డ దివ్యాంగురాలైనా ఆ తల్లి గుండె చెదరలేదు. చుంచుపల్లి వికలాంగుల కాలనీకి చెందిన పుణ్యవతి(81), తన 52 ఏళ్ల దివ్యాంగ కుమార్తె రాజేశ్వరిని 5 దశాబ్దాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇళ్లల్లో పనులు చేస్తూ బిడ్డను సాకిన ఈ మాతృమూర్తి గ్రేట్ కదూ. # నేడు మాతృ దినోత్సవం.