
బహుళ కావ్యములను పరికింపగా వచ్చు బహుళ శబ్దచయము బలుకవచ్చు సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా విశ్వదాభిరామ! వినుర వేమ!! తాత్పర్యం: ఎన్నో కావ్యాలు, గ్రంథాలను చదివి జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అనేక రకాల భాషలను నేర్చుకోవచ్చు. కానీ, ఓర్పుతో ఉండటం చాలా కష్టమైన విషయం. పాండిత్యం కంటే సహనాన్ని అలవర్చుకోవడం గొప్ప విషయం. <<-se>>#PADHYAM<<>>