ఇలాంటి వారు పుట్టినా, చచ్చినా ఒక్కటే!

పెట్టిపోయలేని వట్టి నరుడు భూమి బుట్టనేమి వారు గిట్టనేమి పుట్టలోనజెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ! వినుర వేమ!! తాత్పర్యం: ఎవరికీ సాయం చేయని పిసినారి మనుషులు పుట్టినా, చచ్చినా ఒకటే. పుట్టలో చెదపురుగులు పుడుతూ, చస్తూ ఉంటాయి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పరోపకారం చేయని వారి జీవితం కూడా ఆ చెదపురుగులతో సమానం. <<-se>>#PADHYAM<<>>