హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఇవి ట్రై చేయండి!

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ ఎంతో ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. పూరీలు, మైసూర్ బోండాలు, వడలు లాంటి ఆయిల్ ఫుడ్ కాకుండా పోషకాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. రాత్రి నానబెట్టిన మొలకలు, నట్స్, ఉడకబెట్టిన కోడిగుడ్లు, గ్రీక్ యోగర్ట్‌లో హై ప్రొటీన్ ఉంటుందని, వీటిని అల్పాహారంలో భాగం చేసుకోవాలని అంటున్నారు. చక్కెర, మైదాతో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.