చదువు గొప్పతనం ఇదే.. తెలుసుకోండి

చదువు జదువకున్న సౌఖ్యంబులును లేవు చదువు జదివెనేని సరసుడగును చదువు మర్మమెరిగి చదువగ చూడుము విశ్వదాభిరామ! వినుర వేమ!! తాత్పర్యం: చదువు లేని వారికి జీవితంలో ఎలాంటి సుఖాలు, భోగాలు లభించవు. చదువుకున్న వారే గొప్పవారు అవుతారు. చదువులోని గొప్పతనాన్ని, అందులోని మర్మాన్ని తెలుసుకుని చదవడం అలవాటు చేసుకోవాలి. లేదంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. <<-se>>#PADHYAM<<>>