AC ఆన్ చేసుకొని పడుకుంటున్నారా?

ఎండలు మండిపోతున్నాయి. రాత్రిపూట కూడా తీవ్రంగా ఉక్కపోస్తోంది. ఇంట్లో AC ఉన్నవాళ్లంతా దాన్ని ఆన్ చేసుకునే పడుకుంటున్నారు. అయితే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో పాటు చర్మం, కళ్లు పొడిబారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కండరాలు స్టిఫ్‌గా మారి నొప్పితో ఇబ్బంది కలగొచ్చు. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అలర్జీలేమైనా ఉంటే మరింత తీవ్రమవుతాయి.