టీ తాగితే క్యాన్సర్ ముప్పు.. ఇలా చేయండి!

టీ అంటే ఇష్టపడేవారికి ఇది షాకింగ్ న్యూస్. వేడివేడిగా టీ తాగడం వల్ల ఎసోఫాగియల్ (ఆహార నాళం) క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి పానీయాలు క్రమంగా ఆహార నాళం లోపలి పొరను దెబ్బతీసి కణాల మార్పుకు కారణమవుతాయని వివరించారు. అందుకే టీని కప్పులో పోసిన తర్వాత కనీసం 4 నుంచి 5 నిమిషాలు ఆగి, అది కాస్త చల్లబడ్డాక తాగితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. SHARE IT