భోగాపురం హైవేపై యాక్సిడెంట్.. శ్రీకాకుళం వాసుల మృతి

విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనం లారీ వెనక భాగాన్ని ఢీకొనగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతి చెందగా..సమాచారం అందుకున్న పోలీసులు, 108 ఘటనా స్థలానికి చేరుకుంది. మృతులు శ్రీకాకుళం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.