కల్తీ పుచ్చకాయలను గుర్తించడమెలా?

కొందరు లాభాల కోసం పుచ్చకాయల్లో ఆర్టిఫిషియల్ కలర్లను ఇంజెక్ట్ చేస్తున్నారు. బయటి భాగం ఆకర్షణీయంగా, ఒకే రంగులో కనిపిస్తే అది కల్తీ అయిందని గమనించాలని వైద్యులు సూచిస్తున్నారు. 'కల్తీ పుచ్చకాయ లోపల విత్తనాలు నల్లగా, బ్రౌన్‌గా కాకుండా తెల్లగా ఉంటాయి. ముందే కట్ చేసిన పుచ్చకాయలను కొనుగోలు చేయవద్దు. బయట భాగం పసుపు, ఆరెంజ్ రంగులో ఉంటే పండినవని అర్థం. అలాగే దాన్ని కొడితే ప్రతిధ్వనిస్తుంది' అని తెలిపారు.