
ఝార్ఖండ్‌లో పానీపూరీ తిని 7ఏళ్ల బాలుడు మృతిచెందాడన్న వార్తల నేపథ్యంలో డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. 'పానీపూరీలో కలుషితమైన నీరు వాడితే అందులో బాక్టీరియా ఉంటుంది. వేసవిలో అది వేగంగా వ్యాపిస్తుంది. ఆలు, శనగలు కూడా ఎండ వేడికి త్వరగా పాడవుతాయి. ఇలాంటివి తింటే వాంతులు, విరేచనాలు అయి, డీహైడ్రేషన్ పెరిగి ప్రాణాపాయానికి దారితీస్తుంది. శుభ్రంగా, బిజీగా ఉండే స్టాళ్లలో తినండి' అని సూచిస్తున్నారు.