
కంఫర్ట్‌గా ఉంటుందని చాలా మంది బోర్లా నిద్రపోతుంటారు. అయితే అది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వెన్నుపై ఒత్తిడి పడుతుందని.. మెడ ఎక్కువ సేపు ఒకేవైపు ఉండటం వల్ల కీళ్లు, కండరాల నొప్పులూ వస్తాయని చెబుతున్నారు. బోర్లా పడుకొనేటప్పుడు ముఖం తలగడకు ఒత్తుకొని పడుకోవడం వల్ల చర్మంపై ముడతలు త్వరగా వచ్చే అవకాశం ఉందన్నారు. వెల్లకిలా లేదా ఎడమవైపునకు తిరిగి పడుకోవడం బెటర్ అంటున్నారు.