రెగ్యులర్‌గా హై హీల్స్ వేస్తున్నారా?

రోజూ ఎక్కువసేపు హై హీల్స్ వేసుకోవడం వల్ల బాడీ షేప్ దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల శరీర బరువు ముందుకి పడి వెన్నుపూస, మోకాళ్లపై ప్రెజర్ పడుతుంది. దీర్ఘకాలంలో వెన్నునొప్పి, మెడనొప్పి వస్తాయి. పాదాల కండరాలు బిగుసుకుపోయి నడకలో బ్యాలెన్స్ తప్పుతుంది. ఫలితంగా కింద పడటం, చీలమండ గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ తక్కువ ఎత్తున్న హీల్స్ వాడటం మంచిది.