
రోజూ ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్, విటమిన్లు పుష్కలంగా అందుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది కండరాల బలానికి, మెదడు పనితీరుకు ఎంతో మేలు చేస్తుంది. గుడ్డులోని ల్యూటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యవంతులు రోజుకు ఒక గుడ్డు తినొచ్చు. గుండె సమస్యలు, హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు మాత్రం డాక్టర్ సలహాతో వారానికి 3-4 గుడ్లు తీసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్లు తింటే అధిక క్యాలరీలు ఉండవు.