
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు మాటకన్న నెంచ మనసు దృఢము కులముకన్న నెంచ గుణపు ప్రధానంబు విశ్వదాభిరామ! వినుర వేమ!! తాత్పర్యం: నిత్యం పూజలు చేయడం కంటే మంచి బుద్ధి ఉండటం ముఖ్యం. రోజుకొక మాట చెప్పడం కంటే నిశ్చలమైన మనసు ఉండటం మంచిది. వంశాలు, కులాల గొప్పతనాలు చెప్పుకోవడం కంటే మంచి గుణం ఉండటం ఉత్తమం. <<-se>>#PADHYAM<<>>