
కేదార్‌నాథ్ దర్శించుకునేవారు ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నిర్వాహకులు వెల్లడించారు. కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభమైన వేళ ఆలయ కమిటీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫోన్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు, యాత్రికులకు స్వామి దర్శనం ప్రశాంతంగా సాగేందుకు నిర్వాహకులు ఈ సీజన్ నుంచి వీటిని అమలులోకి తెచ్చారు.