కుప్పకూలిన ప్రైవేట్ జెట్
ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. అటవీ ప్రాంతంలో 30 అడుగుల ఎత్తులో ప్రయాణించడంతో చెట్టును ఢీకొని కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ చనిపోయినట్లు సమాచారం. అందులో మొత్తం ఎంత మంది ప్రయాణించారనేది తెలియాల్సి ఉంది.