
కొంత మంది గంటల తరబడి యూట్యూబ్‌లో షార్ట్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తారు. అలాంటి వారి కోసం స్క్రీన్ టైమ్ తగ్గించేలా యూట్యూబ్ డిజేబుల్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని కోసం యూట్యూబ్ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి టైమ్ మేనేజ్‌మెంట్ సెలక్ట్ చేసుకోవాలి. కింది భాగంలో 'Shorts feed limit' ఆన్ చేసి జీరో మినట్స్ ఎంచుకోవాలి. దీంతో మీకు ఇక షార్ట్స్ కనిపించవు. తిరిగి చూడాలి అనుకుంటే Shorts feed limit ఆఫ్ చేస్తే చాలు.