
దేశానికి లైఫ్‌లైన్‌లా మారిన రైల్వే సరిగ్గా ఇదే రోజున 173 ఏళ్ల కిందట ‘జర్నీ’ ప్రారంభించింది. 1853 ఏప్రిల్ 16న తొలి ప్యాసింజర్ రైలు పరుగులు పెట్టింది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే మధ్య ప్రారంభించింది. ఇందులో 400 మంది ప్రయాణించారు. 34 కిలోమీటర్ల మేర ఏర్పాటైన ఈ ట్రాక్‌పై 13 బోగీలతో రైలు నడిచేది. సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే 3 ఇంజిన్లను రైలును నడిపేందుకు ఉపయోగించేవారట.