
TG: ప్రియుడికి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చేందుకు ఓ యువతి దొంగగా మారింది. ఖమ్మం(D)కు చెందిన యువతి HYDలో ఉద్యోగం చేస్తోంది. అదే జిల్లా యువకుడితో లవ్‌లో ఉంది. 3 రోజుల క్రితం అతడితో కలిసి జూబ్లీహిల్స్‌లోని వాచ్ షోరూమ్‌కి వెళ్లింది. అతడిని కారులో కూర్చొబెట్టి ₹లక్ష విలువ చేసే రెండు వాచ్‌లను దొంగిలించింది. ఆమె వాచ్‌లు బ్యాగ్‌లో వేసుకున్నట్లు పోలీసులు CCTV ఫుటేజీలో గుర్తించారు. యువతి, ప్రియుడిని అరెస్ట్ చేశారు.