కొండగట్టు: ఎండలోనూ తగ్గని అంజన్న భక్తుల రద్దీ
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచే సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు, ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించగా.. దీక్షా స్వాములు, భక్తులు మొక్కులు చెల్లించుకుటున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామివారి సేవలో తరిస్తున్నారు.