చల్లదనం కోసం బీర్లు తాగుతున్నారా?

వేసవిలో బీర్లు తాగితే శరీరం కూల్ అవుతుందనేది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. విపరీతంగా తాగితే మూత్ర విసర్జన పెరిగి శరీరంలోని నీరు అధికమొత్తంలో బయటకు వెళ్లిపోతుందని పేర్కొంటున్నారు. దీనివల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని, కాలేయ, జీర్ణ సమస్యలు, నిద్ర పట్టకపోవడం, రక్తపోటు సమస్యలు వస్తాయంటున్నారు. #ShareIt