సృష్టి రహస్యం: ఒక్క వీడియోలో..
జీవం పురుడుపోసుకునే అద్భుత ప్రక్రియను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. వీర్యకణం అండంలోకి ప్రవేశించడం నుంచి అది క్రమంగా కణవిభజన చెందుతూ పిండంగా మారి తొమ్మిది నెలల పాటు ఎలా ఎదుగుతుందో వీడియోలో చాలా స్పష్టంగా చూపించారు. ప్రకృతి సృష్టిలోని గొప్పదనాన్ని చాటిచెబుతున్న ఈ అద్భుతాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.