
భోజనం వడ్డించాక ఉప్పు సరిపోలేదంటూ చాలా మంది దానిపై రా సాల్ట్‌ను చల్లుకుంటారు. ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఇలా చేయడం వల్ల రక్తంలో సోడియం స్థాయులు పెరిగి ధమనులపై ఒత్తిడి అధికమవుతుంది. గుండెపోట్ల ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీలు డ్యామేజవుతాయి. ఆస్టియోపోరోసిస్, స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. WHO సిఫారసు ప్రకారం పెద్దలు రోజుకు 5 గ్రాముల లోపే ఉప్పు తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు.