వేసవిలో కాళ్ల మంటలకు చెక్ పెట్టండిలా!

వేసవిలో శరీర వేడి పెరగడం వల్ల చాలామందికి అరికాళ్లలో మంటలు వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళ ఈ సమస్యతో నిద్రపట్టక సతమతమవుతుంటారు. చిన్న చిట్కాతో దాన్నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు కొద్దిగా ఆముదం లేదా కొబ్బరి నూనెను అరికాళ్లకు రాసి 2 నిమిషాలు మసాజ్ చేయాలి. దాంతో శరీరంలోని వేడి పాదాల ద్వారా లాగేస్తుంది. ఆపై కాళ్ల మంటలు తగ్గడంతో పాటు బాడీ చల్లబడి గాఢ నిద్ర పడుతుంది.