మధుమేహులు అప్రమత్తంగా ఉండాలి: వైద్యుడు శ్రీకాంత్
డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడం(PAD) పట్ల అవగాహన అవసరమని ప్రముఖ వైద్యుడు శ్రీకాంత్ రాజు తెలిపారు. Way2Newsతో మాట్లాడుతూ.. మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ధూమపానం పూర్తిగా మానేయడం వల్ల రక్త ప్రసరణ సమస్యలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని ఆయన కోరారు.