సరైన వసతులుంటే ప్రభుత్వ బడులకు జై!
TG: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దితే ఆదరణ పెరుగుతుందని నల్గొండ ప్రభుత్వ పాఠశాల నిరూపించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ₹8కోట్లతో మెరుగైన మౌలిక వసతులు కల్పించారు. దీంతో ఇక్కడ సీట్ల కోసం పేరెంట్స్ క్యూ కడుతున్నారు. నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తే ప్రజలు సర్కారీ బడులకే మొగ్గు చూపుతారని ఈ మార్పు స్పష్టం చేస్తోంది. నియోజకవర్గానికి ఒకటైనా ఇలాంటి స్కూల్ ఉండాలి. మీ కామెంట్?