BREAKING: కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు
కూకట్‌పల్లిలోని JNTUHకి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. KPHB పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌తో కలిసి వర్సిటీ అడ్మిన్ బిల్డింగ్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వర్సిటీ యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు, విద్యార్థులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ బెదిరింపు మెయిల్ ఉత్తుత్తిదేనా? లేక కుట్రనా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.