లోపాలను వీడి.. లోకాన్ని ఎదిరించి

ప్రేమకు కళ్లు లేవంటారు. కానీ స్వచ్ఛమైన మనసుంటుందని నిరూపించారు మచిలీపట్నానికి చెందిన షేక్ గౌసియా(19). మతం వేరైనా, తన బాల్య మిత్రుడు శశి(23) మరుగుజ్జుగా ఉన్నా అతణ్నే ప్రాణంగా ప్రేమించారు. పెద్దలు నిరాకరించినా చర్చిలో అతడితో చేతులు కలిపారు. అందం, అంతస్తు కంటే అనురాగమే మిన్న అని చాటిన వీరు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. సమాజం చూసే చూపు కంటే తోడుండే మనసే గొప్పదంటున్న వీరి కథ అందరినీ కదిలిస్తోంది.