RECORD: 'రానూ బొంబాయికి రానూ'కు 800 మిలియన్ల వ్యూస్
2025లో వచ్చిన 'రానూ బొంబాయికి రానూ' అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. తాజాగా 800 మిలియన్ల (80 కోట్ల) వ్యూస్‌ను దాటేసింది. రాము రాథోడ్ లిరిక్స్ రాయడంతో పాటు పాట పాడి నటించారు. కళ్యాణ్ సంగీతం అందించారు. రాముకు జోడీగా లిఖిత అభిమానుల మనసులు దోచుకున్నారు. కాగా అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాట రికార్డు అల వైకుంఠపురములోని 'బుట్టబొమ్మ' పేరిట ఉంది. జానపదాల్లో ఈ పాటదే రికార్డు.