అద్భుత దృశ్యం: ఆర్టెమిస్ పయనం.. ఆకాశం నుంచి
అంతరిక్ష ప్రయోగాలను మనం TVల్లో చూడటం కామన్. కానీ భూమి నుంచి దూసుకెళ్తున్న రాకెట్‌ను గాల్లో ఎగురుతున్న విమానంలో నుంచి చూస్తే? సరిగ్గా ఇలాంటి అరుదైన అనుభవమే ఓ అమెరికన్ ఫ్లైట్ ప్యాసింజర్‌కు ఎదురైంది. నాసా ప్రయోగించిన ‘<<19542665>>ఆర్టెమిస్-2<<>>’ రాకెట్ వెళ్తున్న అద్భుత దృశ్యాన్ని కిటికీ సీట్లో కూర్చున్న సదరు ప్రయాణికుడు కెమెరాలో బంధించారు. మేఘాల పైనుంచి రికార్డ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరలవుతోంది.