చిరు ఇంట హనుమాన్‌ను తాకిన సూర్యకిరణాలు(VIDEO)

తన ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకిన అద్భుత దృశ్యాన్ని మెగాస్టార్ చిరంజీవి Xలో షేర్ చేశారు. ఏటా DEC, JAN, FEB నెలల్లో ఇలా జరుగుతుందని, హనుమాన్ జయంతి సందర్భంగా దీన్ని అందరితో పంచుకుంటున్నట్లు తెలిపారు. అయోధ్య, కోణార్క్, అరసవెల్లి ఆలయాల్లో సంభవించే అలాంటి దైవానుభూతి తమ పూజా మందిరంలో జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.