సంపాదించడమే కాదు.. దాచడమూ నేర్చుకోండి!

ఎంత సంపాదించినా పొదుపు చేయలేకపోతున్నారా? ఈ చిన్న టిప్‌తో నెలకు రూ.4,650 వరకు సేవ్ చేయొచ్చు. నెలలో మొదటి రోజు రూ.10తో మొదలుపెట్టి.. ప్రతిరోజు మరో ₹10 పెంచుకుంటూ వెళ్లాలి. అంటే రెండో రోజు ₹20, పదో రోజు రూ. 100, చివరి రోజైన 30న ₹300 పొదుపు చేయాలి. దీనిని క్రమం తప్పకుండా పాటిస్తే నెల తిరిగేసరికి ఖాతాలో రూ.4,650 (31 రోజులుంటే రూ.4960) జమవుతాయి. చిన్న మొత్తంతో పెద్ద ఆదాకు ఇది సులువైన మార్గం.