
సమ్మర్‌లో బయటికెళ్లి ఇంటికొచ్చేసరికి ఎండ, దుమ్ముధూళితో మొహం నల్లగా మారుతుంటుంది. ఇలాంటి టైమ్‌లో ఇంట్లో ఈజీగా చేసుకొనే ఫేస్ ప్యాక్‌తో మొహాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ గంధం పొడి, 1 స్పూన్ కాఫీ పొడి, చిటికెడు కస్తూరి పసుపు, పచ్చిపాలతో పేస్ట్‌లా చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని సబ్బుతో కడుక్కొని ప్యాక్ వేసుకోవాలి. 15-30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేస్తే ఫేస్‌లో గ్లో వస్తుంది.