
ఎండ తాపాన్ని తట్టుకోవడానికి సమ్మర్‌లో కూలింగ్ వాటర్ తాగుతుంటారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. చల్లటి నీరు గొంతు గరగరకు కారణమవుతుంది. బాడీ వేడిగా ఉండే వేసవిలో కూలింగ్ వాటర్ తాగితే శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు వస్తుంది. కొందరికి తలనొప్పి, అలసట కూడా కలిగిస్తుంది’ అని చెబుతున్నారు.