ఎస్టీ కమిషన్ రాకతో నిజాలు నిగ్గు తేలుతాయి: ఎమ్మెల్సీ రఘురాజు
ఎస్.కోట (M) బొడ్డవర జిందాల్ భూముల అవినీతిపై నిజాలు నిగ్గు తెల్చేందుకు ఈనెల 30న జాతీయ ఎస్టీ కమిషన్ వస్తోందని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు స్పష్టం చేశారు. మంగళవారం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ సోమేశ్వరరావు, సర్పంచ్ సంతోష్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. రైతులని ఎలా మోసం చేశారో పరిశీలించేందుకు కమిషన్ రావడం హర్షనీయం అన్నారు. ఇప్పటికైనా అధికారులు రైతులకు న్యాయం చేయాలని కోరారు.