
డా. బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని మామిడి, జీడి తోటల ఫలసాయం హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య బి. అడ్డయ్య సోమవారం ప్రకటించారు. ఆసక్తి గల వారు రిజిస్ట్రార్, డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పేరుతో రూ.10,000 DD తీయాలని సూచించారు. పూర్తి చేసిన టెండర్ కొటేషన్లను సీల్డ్ కవర్లలో ఈ నెల 30లోపు వర్సిటీ ప్రధాన పరిపాలనా భవనంలోని టెండర్ బాక్సులో వేయాలని ఆయన కోరారు.