ఎండల్లో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

వేసవిలో శరీర చల్లదనం కోసం ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే ఇవి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ‘వాటిలో చక్కెర, కెఫీన్ అధికంగా ఉంటాయి. దీంతో టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, దంతాలు పుచ్చిపోవడం, ఆస్టియోపోరోసిస్, నిద్ర లేమి, డీహైడ్రేషన్, గుండె సమస్యలు రావొచ్చు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, షర్బత్, మజ్జిగ, పండ్లు, కూరగాయల స్మూతీలు తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు. #ShareIt