ఖమ్మం జిల్లాలో 2 చోట్ల భారీ అగ్నిప్రమాదాలు

ఖమ్మం జిల్లాలో శనివారం 2 వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. మధిర(M) ఆత్కూరులోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. మరోవైపు ఖమ్మం నగరంలోని రోటరీనగర్‌లో ఉన్న ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో బ్యాటరీల కారణంగా అగ్నిప్రమాదం జరిగి పలు వాహనాలు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదాల్లో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.