డబ్బు కంటే సంస్కారమే మిన్న: గరికిపాటి

నేటి సమాజంలో సంపాదనపై ఉన్న శ్రద్ధ సంస్కారంపై లేదని ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు పుస్తకాలతో పాటు ప్రకృతిని పరిచయం చేయాలని ఆయన సూచించారు. సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తూ పెరిగే పిల్లల మనసులు సున్నితంగా మారి హింసకు దూరంగా ఉంటారని తెలిపారు. కేవలం డబ్బు వెంటే కాకుండా, చిన్నతనం నుంచే విలువలతో కూడిన జీవితాన్ని అలవాటు చేయాలని తల్లిదండ్రులకు ఆయన పిలుపునిచ్చారు.