మార్చి 3న ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం

2026లో తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన సంభవించనుంది. హోలీ పౌర్ణమి రోజున జరిగే ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది. సూర్యుడు, చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు ఈ ఖగోళ అద్భుతం జరుగుతుంది. గ్రహణ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేయనున్నారు. 2026లో మొత్తం 2 గ్రహణాలు సంభవించనున్నట్లు ఖగోళ నిపుణులు చెబుతున్నారు. రెండోది ఆగస్టు 28న ఏర్పడనుంది.