వృద్ధాప్యంలోనూ వీడని చేయి.. ప్రేమంటే ఇదేగా❤️
ప్రేమంటే యవ్వనంలో కలిగే ఆకర్షణ కాదని, వృద్ధాప్యంలో ఒకరికొకరు ఆసరాగా నిలవడమని ఈ వృద్ధ జంట నిరూపిస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నా ఒకరికొకరు ఆసరాగా మారి వీరు పంచుకుంటున్న అనురాగం నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. అందం, ఐశ్వర్యం ముగిసినా 'నేనున్నాననే' భరోసా ఇవ్వడమే అసలైన ప్రేమ అని ఈ జంట తెలియజేస్తోంది. కొత్త జంటలు వీరిని చూసి వివాహ బంధం అంటే ఏంటో తెలుసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.