అనిల్‌ రావిపూడికి మెగాస్టార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

డైరెక్టర్ అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో అనిల్‌కు చిరు ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్‌ కారును గిఫ్ట్‌‌గా అందించారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మెగాస్టార్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. గతంలో ఆయన పుట్టినరోజుకు చిరు విలువైన వాచ్‌ను ఇచ్చారు.