
కందిలోని IITHలో నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో తొలి వార్షిక పుస్తక ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగే ఈ బుక్ ఫెయిర్‌లో విద్యా సంబంధిత గ్రంథాలతో పాటు బాలల సాహిత్యం, జనరల్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, పుస్తక ప్రియులు పాల్గొన్నారు.