దగ్గుబాటి సోదరులపై కోర్టు సీరియస్

TG: ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్‌ కూల్చివేత కేసులో దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రానాపై నాంపల్లి కోర్టు ఆగ్రహించింది. ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తారని ప్రశ్నించింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని వ్యాఖ్యానించింది. ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారని మండిపడింది. FEB 5న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని, లేదంటే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంది.